
నీటి నిల్వకు అడుగులు
కృష్ణానదిపై ఉన్న పాత వంతెనకు షెట్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
● రెండు టీఎంసీలు నిలిచే అవకాశం
● ఇప్పటికే కర్ణాటకతో కొనసాగుతున్న చర్చలు
● కృష్ణా, మాగనూర్ రైతులకు
పూర్తిస్థాయిలో అందనున్న సాగునీరు
కల సాకారం కానుంది..
ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలకు ప్రాజెక్టుగాని, డ్యాంగాని ఏర్పాటు చేయాలని చాలాకాలంగా కోరుతున్నాం. భీమా ప్రాజెక్టుపై చేపడుతామని ప్రజాప్రతినిధులు చెబుతూనే వస్తున్నారు కానీ చేపట్టడం లేదు. ఇప్పటికై నా ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని వంతెనకు షెట్టర్లు బిగించి సాగునీటిని అందిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది.
– సంతోష్, రైతు, గుడెబల్లూర్
వంతెన పనులకు వెళ్లాం..
కృష్ణానదిపై వంతెన నిర్మాణ సమయంలో నా వయస్సు 11 ఏళ్లు. అప్పుడు మా కు టుంబ సభ్యులు, గ్రామస్తులకు పనులకు వెళ్లేవారు. వా రి వెంట నేను కూడా వెళ్లా. నాడు నిర్మించిన వంతెన నేడు మాకు సాగునీరు అందించేందుకు ఉపయోగపడుతుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు నా వయస్సు 91 ఏళ్లు.
– హన్మంతు, గుడెబల్లూర్
రైతుల సంక్షేమమే ధ్యేయం..
కృష్ణానదిపై ఇప్పుడున్న పా త వంతెనకు షెట్టర్లు బిగించి రెండు టీఎంసీల నీటి నిల్వ కు నిర్ణయం తీసుకున్నాం. అ లాగే భీమానదిపై ఎక్కడికక్క డ చెక్‌డ్యాంలు నిర్మించి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించబోతున్నాం.ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవు.
– వాకిటి శ్రీహరి,
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
●
కృష్ణా: మండలంలోని కృష్ణానదిపై ప్రస్తుతం ఉన్న పాత వంతెనకు షెట్టర్లు ఏర్పాటు చేసి రెండు టీఎంసీల నీటినిల్వకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త వంతెన వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పాత వంతెన నిరుపయోగంగా మారకుండా షెట్టర్లు ఏర్పాటు చేసి నదికి సమాంతరంగా నీటిని నిలిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నీటినిల్వతో పరిసర గ్రామాలకు సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా అంగీకరించనుందని.. ప్రాజెక్టు విజయవంతమయ్యేందుకు అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మాగనూర్, కృష్ణా మండలాల్లోని పొలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కృష్ణా మండలంలో 31 వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. కేవలం 13 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. మిగతా 18 వేల ఎకరాల్లో రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. మాగనూర్ మండలంలో 30 వేల ఎకరాలు ఉండగా.. 18 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడ పెద్దవాగు తీరంతో పాటు సంగంబండ ప్రాజెక్టు నుంచి అత్యధికంగా సాగునీరు అందుతోంది. మిగిలిన 12 వేల ఎకరాల్లో వర్షధార పంటలు సాగు చేస్తున్నారు.
● నిజాం కాలం నాటి వంతెన..
1933లో హైదరాబాద్ నిజాం కాలంలో కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి పునాది వేయగా 1945లో పూర్తయింది. సుమారు 12 ఏళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగాయి.
● కృష్ణా జలాల్లో రాష్ట్రవాటా పూర్తిగా వినియోగించుకుంటున్నా.. భీమానది నీటి విషయంలో 5 టీఎంసీలు వృథా అవుతున్నాయి. షెట్టర్లు ఏర్పాటుతో వీటిని కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో వరి, పత్తి అత్యధిక దిగుబడి సాధించిన మండలంగా కృష్ణా గుర్తింపు పొందింది. ఇకమీదట సాగు విస్తీర్ణం పెరగడంతో దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మండలంలోని చేగుంట, ఐనాపూర్, కున్సీ, ఆలంపల్లి, హిందూపూర్‌లో నల్లరేగడి భూములున్నాయి. ఇక్కడి రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తుంటారు.

నీటి నిల్వకు అడుగులు

నీటి నిల్వకు అడుగులు

నీటి నిల్వకు అడుగులు