
స్నాతకోత్సవానికి హాజరు
మహూబబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో గురువారం నిర్వహించే నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారని వీసీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు కంపెనీలు ప్రారంభించి యువతకు ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎన్ రెడ్డికి సామాజిక సేవా విభాగంలో పీయూ చరిత్రలో మొదటిసారి గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం మొత్తం 88 గోల్డ్ మెడల్స్, 12 డాక్టరేట్‌లు ప్రదానం చేస్తున్నామన్నారు. అలాగే 2,809 పీజీలు, 8,291 ప్రొఫెషనల్ కోర్సులు, 18,666 యూజీ డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, మీడియా కమిటీ చైర్మన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.