
డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి
పాలమూరు: మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నాయని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ హాజరై జిల్లాలో మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడం లక్ష్యమన్నారు. డ్రగ్‌ల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు చేసే సమాచారం ఉంటే కంట్రోల్ రూం నంబర్ 87126 59360 లేదా డయల్ 100కు చెప్పాలన్నారు. మోసపూరిత లింక్‌లు ఎవరూ ఓపెన్ చేయరాదని, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉమెన్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ కృష్ణాజీ పాల్గొన్నారు.