
సద్వినియోగం చేసుకోవాలి..
పీయూలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని సదుపాయాలు ఉన్నా యి. సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం వంటివి ఉండటం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి ఎంతో ప్రయోజనకరం. పోటీల్లో పాల్గొనే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతిభచాటిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తు న్నాం. పీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు సౌత్‌జోన్, ఇంటర్ యూనివర్సిటీ పో టీల్లో ఎంపికయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్‌లతో ఉద్యోగాల్లో రిజర్వేషన్ సైతం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్, పీయూ
●