
నూతన సాంకేతికతతో..
ఈ ఏడాది జిల్లాలో 80,534 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. 8,05,340 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ముందుగా అంచనా వేసింది. సీసీఐ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, దళారులు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు తావివ్వకుండా నూతన సాంకేతికతతో ఈ యాప్ ద్వారా పత్తి అమ్మకాలను పకడ్బందీగా కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పకడ్బందీగా ఏర్పాట్లు..
సీసీఐ పత్తి కొనుగోళ్ల కోసం పకడ్బందీగా ఏ ర్పాట్లు చేస్తున్నాం. కపా స్ కిసాన్ యాప్‌లో రైతు లు తప్పనిసరిగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దళారుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం నూత న యాప్ తీసుకువచ్చింది. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సీసీఐకి అమ్ముకోవచ్చు. పత్తిని పూర్తిగా శుభ్రంగా ఎండబెట్టి నాణ్యతగా తీసుకువస్తేనే మద్దతు ధర లభిస్తుంది.
– బాలమణి, మార్కెటింగ్ శాఖ ఏడీ
●