
ఫొటోల అప్‌లోడ్‌తో ఇందిరమ్మ బిల్లు
సద్వియోగం చేసుకోవాలి..
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వివరాల నమోదుకు యాప్‌లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. బిల్లుల ప్రతిపాదలనలో జాప్యం నివారణ, ఇబ్బందులు దూరం చేసేందుకు గాను ఫొటోలు అప్‌లోడ్ చేసే అవకాశం నేరుగా లబ్ధిదారులకే కల్పించింది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం మొదలైనప్పటి నుంచి వివిధ దశల ఫొటోలు తీసి పంచాయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. అవి గృహ నిర్మాణ శాఖ ఏఈ లాగిన్‌కు ఆ తర్వాత డీఈ, పీడీ, కలెక్టర్‌కు చేరేవి. పునాది పూర్తయితే రూ.లక్ష, స్లాబ్ లెవల్ (గోడలు) వరకు పూర్తయితే మరో రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.2 లక్షలు, రంగులతో సహా ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాక రూ.లక్ష ఇలా విడతల వారిగా మొత్తం రూ.5 లక్షలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అయితే పంచాయతీ కార్యదర్శులు ఈ ప్రక్రియ చేపట్టడంలో కొంత ఆలస్యం చేయడం, దీంతో లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూసే పరిస్థితులు తలెత్తేవి. ఈ జాప్యాన్ని నివారించేందుకు గాను ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేసేందుకు నూతన యాప్‌ను తీసుకొచ్చింది.
నమోదు ఇలా..
లబ్ధిదారులు స్మార్ట్ ఫోన్ (ఇంట్లో ఎవరిదైనా)లో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. బెనిఫిషియర్ లాగిన్‌కు వెళ్లి.. పేరు, ఫక్షన్ నంబర్, గ్రామ వివరాలు నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. నిర్మాణ దశలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తే ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియను జిల్లాలోని చాలామంది లబ్ధిదారులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
యాప్‌లో అందుబాటులోకి
కొత్త ఆప్షన్
నేరుగా లబ్ధిదారులే
ఎంట్రీ చేసే అవకాశం
ప్రతిపాదనలో జాప్యానికి
తప్పనున్న తిప్పలు
ఇందిరమ్మ లబ్ధిదారులు స్వయంగా ఫొటో అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేస్తే పరిశీలన తర్వాత బిల్లులు వారి ఖాతాలో జమ అవుతాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.
– వైద్యం భాస్కర్,
గృహ నిర్మాణ శాఖ పీడీ