
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయ సేకరణ
కులాలను పరిగణలోకి తీసుకోవాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో జిల్లా కాంగ్రెస్, బ్లాక్, మండల స్థాయిలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీగణేష్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోనం తనకు ఏఐసీసీ పరిశీలకుడిగా నియామకం చేశారన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేయవచ్చని, ఆశావాహులు ఈ నెల 20 వరకు దరఖాస్తుఫారాలు అందజేయాలని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో అభిప్రాయాలు సేకరిస్తామని, 22లోగా నివేదికను ఏఐసీసీకి సమర్పిస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో వ్యక్తిగతంగా, గ్రూపులుగా అభిప్రాయాలు సేకరణ ఉంటుందన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, వివిధ చైర్మన్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించగా.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నట్లు తెలిసింది.సమావేశంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ పరిశీలకులు మెట్టు సాయికుమార్, ఉజ్మా షాకీర్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, నాయకులు సంజీవ్ ముదిరాజ్, వినోద్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి, మన్నె జీవన్‌రెడ్డి, జహీర్ అఖ్తర్, వసంత, సిరాజ్‌ఖాద్రీ, సీజే బెనహర్, అజ్మత్‌అలీ, అవేజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ముగ్గురం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారమేనని, ప్రభుత్వం కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పోరాడుతుందని, ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీల్లో సమర్థవంతమైన నాయకులను డీసీసీ అధ్యక్షుడిగా పరిగణలోకి తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.