
విద్యుదాఘాతంతో యువరైతు దుర్మరణం
రాజోళి: విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందిన ఘటన మండలంలోని తుమ్మలపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకా రం.. తుమ్మలపల్లి గ్రామా నికి చెందిన సోమేశ్వర్‌రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా, చిన్న కుమారుడు శివారెడ్డి(28) గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. తూ ర్పుగార్లపాడు శివారులో వరి పంటను సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటార్ ఆన్ చేస్తుండ గా, విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కు ప్పకూలాడు. వెంటనే గమనించిన చుట్టుపక్క ల రైతులు కుటుంబ సభ్యులకు సమాచా రం అందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి కర్నూల్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతనికి భార్య వాణి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామంలో యువకుడు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
చికిత్స పొందుతూ మహిళ మృతి
రాజాపూర్(బాలానగర్):క్షిణికావేశంలో మహిళ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది. బాలా నగర్ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలగిరి గ్రామానికి చెందిన సింగపోగు పద్మమ్మకు(45) తిర్మలగిరి గ్రామానికి చెందిన శంకరయ్యతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కూతురు హైదరాబాద్‌లో ఉంటోంది. కూ తరు డెలివరీ కావడంతో పద్మమ్మ అక్కడికి వె ళ్లింది. మూడునెలలైనా ఇంటికి రాకపోవడంతో భర్త ఆమె ఫోన్ చేసి తనకు కష్టంగా ఉంది రావాలని కోరాడు. ఈనెల 9న తిర్మలగిరికి వ చ్చిన పద్మమ్మ భర్తను ఎందుకు ఫోన్‌చేసి రమ్మన్నావని గొడవ పడింది. కోపంతో తిడుతూ క్షిణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం జి ల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 10న జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. ఆమె తమ్ముడు యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నిందితుల రిమాండ్
నాగర్‌కర్నూల్ క్రైం: కుటుంబకలహాలతో కన్నతల్లిని కన్నకొడుకు గొంతు నులిమి చంపిన సంఘటనలో నిందితులను ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా.. మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్లలో అలివేల (50), ఆమె కుమారుడు శివ, కోడలు పద్మ నివసిస్తుండేవారు. అయితే, అయితే, కుమారుడు శివ జులాయిగా తిరుగుతుండడంతో తల్లి అలివేల మందలించడంతో ఆమైపె కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని పథకం రచించారు. శుక్రవారం అర్ధరాత్రి తల్లి అలివేల నిద్రిస్తుండగా కుమారుడు శివతోపాటు కోడలు పద్మ ఇద్దరు కలిసి గొంతునులిమి చంపినట్లు సీఐ తెలిపారు. ఆదివారం నిందితులను అరెస్టు చేసి విచారించడంతో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం
కల్వకుర్తి రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తర్నికల్ వద్ద ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వాహ నం ఢీకొట్టిన సంఘటనలో అదే గ్రామానికి చెందిన కొప్పు సాయిలు (58) అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిలు పని నిమిత్తం కల్వకుర్తికి వచ్చి తిరిగి ఆర్టీసీ బస్సులో గ్రామానికి చేరుకొని ఇంటికి వెళ్తుండగా నాగర్‌కర్నూల్ నుండి కల్వకుర్తి వైపు వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు సంఘటన స్థలంలోనే కాసేపు ఆందోళన చేశా రు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మాధవరెడ్డి ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కల్వ కుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
‘మహిళా
అభ్యున్నతికి కృషి’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామని సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు దోర్నాల సత్యం అన్నారు. ఆదివారం వన్‌టౌన్ సమీపంలోని సంఘం కార్యాలయంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయం ఉపాధి పథకాలు అమలయ్యేలా చూస్తామన్నారు. వారు ఉన్నత విద్య అభ్యసించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ముఖ్యంగా బోర్డు మండల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాయగారి వేమారెడ్డి, బైరిశెట్టి శశిధర్, కావలి శ్రీధర్, తుమ్మ వీరస్వామి, వతులసీదాస్ చౌదరి, పాలకొండ మల్లేష్, ప్రదీప్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో యువరైతు దుర్మరణం