
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
● 79వేల క్యూసెక్కుల వరద
● 6 క్రస్టు గేట్ల ఎత్తివేత
● 82,813 క్యూసెక్కుల నీరు దిగువకు
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 1.57 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 79 వేల క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు 6 క్రస్టు గేట్లను ఎత్తి 41,742 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుద్పత్తి ద్వారా 40, 476 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కు లు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 82,813 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీ టి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎగువ విద్యుదుత్ప త్తి కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు ఉత్పత్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
13 గేట్ల ద్వారా నీటి విడుదల
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 61,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 13 గేట్ల ద్వారా 56,927 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 2,180 క్యూసెక్కులు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
కోయిల్‌సాగర్ నీటి మట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటి మట్టం ఆదివారం సాయంత్రం వరకు 32.3 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులు కాగా.. మరో 0.3 అడుగుల చేరితే గేట్లను తెరిచే అవకాశం ఉంది. ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి వరుసగా చివరి రెండు వారాలు గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు.