
యువత అన్ని రంగాల్లో రాణించాలి
మక్తల్: యువత అన్ని రంగాల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఐరావత్ సినీ కల్చరల్ సంస్థ ఆధ్వర్యంలో మక్తల్‌కు చెందిన యువకులు చిత్రీకరించిన హరికథ సినిమా పోస్టర్‌ను ఆదివారం మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ ప్రాంతానికి చెందిన దర్శకుడు అనుదీప్‌రెడ్డితో పాటు నిర్మాతలు రంజిత్‌గౌడ్, వివేకానంద, రాఘవేందర్, కవిత తదితరులు అన్నివర్గాలకు నచ్చే కుటుంబ ప్రేమ కథా చిత్రం రూపొందించడం అభినందనీయమన్నారు. మక్తల్ నియోజకవర్గంలోనే సినిమాను చిత్రీకరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సినీ నటులు కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్‌రామ్, లావణ్య, కీర్తి, భాస్కర్, కృష్ణ పాల్గొన్నారు.
● మక్తల్‌లోని క్రీడా ప్రాంగణంలో కంట్రీ క్లబ్ వ్యవసాయ స్థాపకుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీచర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని.. ప్రతి ఒక్కరూ క్రీడలకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్ శెట్టి, గణేశ్‌కుమార్, భాస్కర్, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
హరికథ సినిమా పోస్టర్ విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి