
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో భావి సైంటిస్టులను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. అందుకోసం పాఠశాల విధులతో పాటు పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు, ఎస్సెస్సీ వారికి ముందే సిలబస్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ల్యాబ్‌లో ఉచితంగా ప్రయోగాలు చేసుకునేందుకు ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు వస్తారు. చాలా మందికి ప్రముఖ సైంటిస్టులతో ముఖాముఖి సైతం నిర్వహిస్తున్నాం.
– శ్రీధర్, స్కూల్ అసిస్టెంట్, నవాబ్‌పేట
ఇంట్లోనే సైన్స్ ల్యాబ్
సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీధర్ అందరి ప్రశంసలు పొందుతున్నారు. గతంలో ఆయన గైడ్ టీచర్‌గా వ్యవహరించి విద్యార్థుల ద్వారా చేసిన పలు ప్రయోగాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. చివరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సైతం అందుకున్నారు. పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో సైతం పిల్లలకు సైన్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అబ్దుల్ కలాం డ్రీం ఫోర్సు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక కమిటీ ఆధ్వర్యంలో తన ఇంటిపైనే పలువురి సహకారంతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇందులో సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు నేరుగా వెళ్లి ల్యాబ్‌లో ప్రయోగాలు తదితర అంశాలను ఉచితంగా నేర్చుకోవచ్చు.

అవగాహన కల్పిస్తున్నాం..