
గురువులే మార్గదర్శకులు
పాఠానికి ప్రాణం పోసి..
జడ్చర్ల మండలంలోని రామస్వామిగుట్టతండా పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు రవి విద్యార్థులకు సులువైన పద్ధతిలో వినోదాత్మకంగా బోధించాలని సంకల్పించారు. అందుకోసం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాదాపు కథల రూపకంగానే ఎక్కువ సిలబస్ ఉంటుంది. దీంతో ఆయన విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా బోధన ప్రారంభించారు. పాఠ్యాంశంలో చిలుక, లేదా పిల్లి పేరుతో కథ ఉంటే విద్యార్థులకు ఆ వేషాలు వేయించి బోధించడం ఎంతగానో ఆకర్షిస్తుంది. పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించే పద్ధతిని ఆయన తీసుకువచ్చారు. వీటితోపాటు సైన్స్‌లో మానవ శరీర భాగాలను మనిషి ఎత్తులో చిత్రీకరించి విద్యార్థులకు సులభమైన పద్ధతిలో బోధిస్తూ ఔరా అనిపిస్తున్నారు.
మూస ధోరణిలో కాకుండా..
విద్యార్థులకు మూస ధోరణిలో కాకుండా వినూత్నమైన పద్ధతిలో బోధించడం వల్ల సులువుగా అర్థమవుతుంది. అందుకోసం విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న క్యారెక్టర్లకు అనుగుణంగా వేషాలు వేయించి బోధిస్తే వారు ఎప్పటికీ పాఠ్యాంశాలను మర్చిపోలేరు. ఈ విధానం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
– జి.రవి, ఎస్జీటీ ఉపాధ్యాయుడు, ఎంపీపీఎస్ రామస్వామిగుట్టతండా, జడ్చర్ల మండలం
బోధనలోవినూత్నం.. వరించిన పురస్కారం