
యోగాసనాలలోఏఎస్‌ఐ వనజ ప్రతిభ
మహబూబ్‌నగర్ క్రైం: తెలంగాణ యోగాసన అసోసియేషన్ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి సీనియర్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్– 2025 ట్విస్టింగ్ బాడీ– ఫార్వర్డ్ బెండింగ్ ఈవెంట్‌లో ఏఎస్‌ఐ వనజ ప్రతిభచాటారు. మొదటి స్థానంలో నిలిచిన ఆమెను సోమవారం ఎస్పీ డి.జానకి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సేవలతోపాటు క్రీడారంగంలో కూడా ప్రతిభ కనబరచడం గర్వకారణం అన్నారు. ప్రతిభావంతులైన సిబ్బందికి పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని భవిష్యత్‌లో ఇంకా మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
65 మంది
సీసీల బదిలీ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): డీఆర్‌డీఓ శాఖ సెర్ప్ పరిధిలో పనిచేస్తున్న 65 మంది సీసీలను బదిలీ చేశారు. సోమవారం డీఆర్‌డీఓ నర్సింహులు వారికి కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లను కేటాయించారు. ఇందులో క్లస్టర్ల పరిధిలో కౌన్సెలింగ్ ద్వారా వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం ఆయా స్థానాల్లో జాయిన్ కావాలని డీఆర్‌డీఓ సూచించారు.
భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
కోడేరు: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన తీగలపల్లి గ్రామ భూ నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌రాములు డిమాండ్ చేశారు. సోమవారం కోడేరు మండలం తీగలపల్లిలో భూ నిర్వాసితులు నష్టపరిహారం చెల్లించాలని నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దాదాపు 70మంది రైతులు పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగినా అధికారులు స్పందించడం లేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జల్లా కార్యదర్శి నర్సింహ, భూ నిర్వాసితులు ఆంజనేయులు, వెంకటయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శివశంకర్ వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

యోగాసనాలలోఏఎస్‌ఐ వనజ ప్రతిభ