
ముగిసిన షా అలీ పహిల్వాన్ ఉర్సు
అలంపూర్: పట్టణంలోని హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు శుక్రవారం ముగిసింది. చివరి రోజు మహిళల ఉర్సుతో ఉత్సవాలు ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 20న గంధంతో ఉర్సు ప్రారంభం కాగా.. 21న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ పోటీలు, 22న దడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు నిర్వహించారు. ఉర్సులో పెద్ద కిస్తీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. భక్తులు కిస్తీలకు ప్రసాదం అందించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు భారీగా హాజరై కిస్తీ పోటీలను తిలకించారు. ఉర్సు చివరిరోజు గాజులు, బొమ్మల దుకాణాల వద్ద మహిళల రద్దీ కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాలుగో రోజు మహిళలకు ప్రత్యేకం