
మళ్లీ వరికే మొగ్గు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): వానాకాలం వచ్చేస్తోంది. రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సైతం వానాకాలం పంట సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 3,46,830 ఎకరాలలో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 15,332 ఎకరాలలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని తేల్చారు. కాగా.. గతేడాది వానాకాలంలో అత్యధికంగా వరి పంటను 1,94,982 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించగా, ఈ ఏడాది 2,00,000 ఎకరాలకు పెంచారు. సన్నాలకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో గత వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు అంచనాలకు మించి వరి పంట వేశారు. దీంతో ఈ ఏడాది వ్యవసాయ ప్రణాళికలో వరి సాగు లక్ష్యం పెంచారు. వరి తర్వాత అత్యధికంగా 85 వేల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉంది.
46,700 మెట్రిక్ టన్నులు అవసరం
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 46,700 మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు అవసరం అవుతాయని అంచనా. అయితే ఇప్పటికే 33,286.64 టన్నులు సిద్ధంగా ఉంచారు. దశల వారీగా అన్ని మండలాల్లో పీఏసీఎస్, డీలర్ల వద్దకు చేరుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎక్కువగా వినియోగించే డీఏపీ నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే సీజన్ ఆరంభం నాటికి డీఏపీ నిల్వలు సరిపడనంతగా అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. డీఏపీ స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వాడుకోవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
33,286.64
6891.93
3408.61
22,335.2
202.35
448.55
డీఏపీ
మొత్తం
ఎంఓపీ
ఎస్‌ఎస్పీ
కాంప్లెక్స్
యూరియా
మార్పిడి పద్ధతి పాటిస్తే మేలు
రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటను సాగు చేయకుండా ఏటేటా పంట మార్పిడి విధానాన్ని అమలు పరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. భూసారానికి మేలు చేకూరుతుంది. మిశ్రమ పంటల సాగుతో నష్టాలు జరగకుండా నియంత్రించవచ్చు. ఒక పంట చేజారినా మరో పంట దిగుబడులతో లాభాలు గడించవచ్చు.
– బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
లెక్కలు తీస్తున్న
వ్యవసాయ అధికారులు
ఈ ఏడాది ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడంతో ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఎదురవడంతో ఈ ఏడాది ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఎరువుల నిల్వలను తనిఖీ చేస్తున్నారు. సొసైటీలు, డీలర్ల వద్ద డీఏపీ, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల లభ్యతపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు, వానాకాలం పంటలకు అవసరమయ్యే ఎరువులపై లెక్కలు తీస్తున్నారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి వ్యవసాయ అధికారులు రోజువారీ పర్యటించి తమ పరిధిలో ఉన్న డీలర్ల దగ్గర ఎరువుల నిల్వలను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. వాస్తవానికి వానాకాలం సీజన్ ఆరంభానికి ముందే 50 శాతం విత్తనాలు, ఎరువులు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతారు. అందులోభాగంగా ప్రైవేట్ డీలర్లతో పాటు సొసైటీల వద్ద తగిన విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎరువుల కొనుగోలుకు ప్రతి రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం ఒరిజినల్, జిరాక్స్, ఆధార్ జిరాక్స్ ధ్రువపత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గరిష్ట ధర, సబ్సిడీ వివరాలు ఎరువుల బస్తాపై స్పష్టంగా రాస్తారు. వీటిని గమనించి రైతు తీసుకోవాల్సి ఉంటుంది.
రసాయన ఎరువుల నిల్వలు
(మెట్రిక్ టన్నుల్లో)
వానాకాలం పంట ప్రణాళిక ఖరారు
జిల్లాలో 3.46 లక్షల ఎకరాల్లో పంటలు
గతేడాది కంటే 15,332 ఎకరాలు ఎక్కువ
వరి, పత్తి పంటలకే పెద్దపీట
క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు
33,286 టన్నుల ఎరువులు సిద్ధం

మళ్లీ వరికే మొగ్గు

మళ్లీ వరికే మొగ్గు

మళ్లీ వరికే మొగ్గు