
శ్రీశైలానికి వరద ప్రవాహం
దోమలపెంట/ రాజోళి: ఎగువ ప్రాంతం సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం 15,602 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 817.7 అడుగుల వద్ద 39.1450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదిలా ఉండగా గత 24 గంటల వ్యవధిలో రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే సుంకేసుల డ్యాంకు శుక్రవారం 2,215 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఒక గేటును 0.5 మేర తెరిచి అదే స్థాయిలో దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. అలాగే కేసీ కెనాల్‌కు 159 క్యూసెక్కులను వదిలినట్లు ఆయన పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
నారాయణపేట: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖ డీఎం సైదులు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని అప్పిరెడ్డిపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులతో కలిసి ఇంటిపై దాడి చేసి పట్టుకున్నట్లు డీఎం వివరించారు.