
ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్నాలు పండించిన రైతులకు బోనస్ ఇచ్చామని గుర్తుచేశారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, నాయకులు సురేందర్‌రెడ్డి, రాములుయాదవ్, అజ్మత్‌అలీ, అవేజ్, సంజీవ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, అబ్దుల్ హక్, దేవేందర్ నాయక్, హన్మంతు, చిన్న, ప్రశాంత్ పాల్గొన్నారు.