
ఉత్తమ ప్రతిభకు ప్రశంస
మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖలోని నలుగురు అధికారులకు డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. నలుగురు అధికారులు ప్రశంసాపత్రాలు పొందడం జిల్లాకే గర్వకారణమన్నారు. జిల్లాలో ఉన్న మిగిలిన సిబ్బంది స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్తేజంతో పని చేయాలని సూచించారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలిస్తూ, బాధితులకు న్యాయం అందించడం వల్లే ఈ గుర్తింపు దక్కిందన్నారు.
ప్రతిభ కనబర్చిన అధికారులు..
60 రోజుల వ్యవధిలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ పోక్సో కేసుల్లో చార్జిషీట్ నమోదు చేసినందుకు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన రూరల్ సీఐ గాంధీనాయక్, అవుట్ స్టాండింగ్ కేసుల డిటెక్షన్‌లో మూడో స్థానంలో నిలిచిన జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, అండర్ ఇన్విస్టిగేషన్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానం నిలిచిన మహబూబ్‌నగర్ రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్, సీఈఐఆర్, క్యూఆర్ కోడ్ వినియోగంలో ఐదవ స్థానంలో నిలిచిన నవాబ్‌పేట ఎస్‌ఐ విక్రమ్‌ను డీజీపీ ప్రశంసా పత్రంతో అభినందించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అభినందించిన డీజీపీ జితేందర్
స్ఫూర్తి పొందాలన్న ఎస్పీ జానకి

ఉత్తమ ప్రతిభకు ప్రశంస