
కారు బోల్తా.. వైద్య విద్యార్థులకు గాయాలు
బిజినేపల్లి: మండలంలోని మంగనూర్ గ్రామ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఎస్‌వీఎస్ కళాశాలకు చెందిన నలుగురు పీజీ వైద్య విద్యార్థులుకు గాయాలు కాగా, విఠల్ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ నుంచి నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహించేందుకు నలుగురు పీజీ వైద్య విద్యార్థులు విఠల్, స్రవంతి, విష్ణుతో పాటు మరొకరు ఒకే కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మంగనూర్ గ్రామ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు 108లో మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన విద్యార్థుల్లో విఠల్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన్నట్లు సమాచారం.
చెరువులో పడి వ్యక్తి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు చెరువులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీపురం గ్రామంలో చోటు చేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. శ్రీపురం గ్రామానికి చెందిన గుంటి శాంతయ్య(50)కు మతిస్థిమితం సరిగా లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామంలోని ఊరచెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. బుధవారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.
ఒకరి పరిస్థితి విషమం