
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మహబూబ్‌నగర్ రూరల్: వృద్ధులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం అర్బన్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మొదటిసారిగా వృద్ధులు, దివ్యాంగుల కోసం నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్‌తో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రతినెలా మొదటి బుధవారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణిలో తమతమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. తమ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో 38 మంది దరఖాస్తులను స్వీకరించారు. సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌డీఓ జోజప్ప, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డీడబ్ల్యూఓ జరీనాబేగం, తహసీల్దార్ ఘాన్సీరాంనాయక్, ఎల్‌డీఎం భాస్కర్, ఎకై ్సజ్ అండ ప్రొహిబిషన్ అధికారి నర్సింహారెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు నాగభూషణం, బాలయ్య, మనోహర్‌రావు, రాజసింహుడు తదితరులు పాల్గొన్నారు.