
సంజనకుఎస్పీ అభినందన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఇటీవల తోటి కళాకారులతో కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శనలో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన నగరానికి చెందిన సంజనను ఎస్పీ డి.జానకి అభినందించారు. మహబూబ్‌నగర్‌లోని రైతుబజార్‌లో కూరగాయల వ్యాపారం చేసే భాగ్యలక్ష్మి, మాడమోని చందు దంపతుల ఏకై క కూతురైన ఈ బాలిక ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని చైతన్య సెంట్రల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. అలాగే స్థానిక వైష్ణవి ఆర్ట్స్ అకాడమిలో క్లాసికల్ డాన్స్ టీచర్ విజయలక్ష్మి వద్ద తొమ్మిదేళ్ల పాటు కూచిపూడి నాట్యం నేర్చుకుంది. గురువారం ఎస్పీని ఈ విద్యార్థిని తన తల్లిదండ్రులతో పాటు కలిశారు. కాగా, చదువులోనూ ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకునిరావాలని సూచించారు.
బాదేపల్లి మార్కెట్‌కు పోటెత్తిన మొక్కజొన్న
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్ యార్డుకు గురువారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 2,474 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్‌గా గరిష్టంగా రూ.2,259, కనిష్టంగా రూ.1,681 ధరలు లభించాయి. అదేవిధంగా వేరుశనగ గరిష్టంగా రూ.6,639, కనిష్టంగా రూ.5,241, కందులు రూ.6,411, రాగులు రూ.2,711, చిందగింజలు రూ.3,427, జొన్నలు గరిష్టంగా రూ.4,177, కనిష్టంగా రూ.3,277, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,925, కనిష్టంగా రూ.1,809, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,306, కనిష్టంగా రూ.1,809, ఆముదాలు రూ.గరిష్టంగా రూ.6,188, కనిష్టంగా రూ.6,058 ధరలు పలికాయి.
ఎన్టీఆర్ కళాశాలలో జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రబంధ వాజ్మ యం సాహిత్యం శీలనముఅనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నేటి కాలంలో కవులు అంతరించి పోతున్నారని, ఇలాంటి తరుణంలో కళాశాలలో ప్రబంధ వాజ్మయం పేరుతో సెమినార్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ ప్రబంధ వాజ్మయం హాస్యం, చతురత, వర్ణన, శృంగారం, కథ అనే అంశాల ఆధారంగా ఆనాటి జీవన స్థితిగతులను, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివరిస్తుందన్నారు. ఈ సందర్భంగా సెమినార్ సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీయూ కంట్రోలర్ రాజ్‌కుమార్, లక్ష్మీనరసింహరావు, కేశర్దన్ తదితరులు పాల్గొన్నారు.
22న జిల్లా సదస్సు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మే 20న నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. గురువారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్‌గౌడ్, వేణుగోపాల్, అనురాధ, పద్మ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంజనకుఎస్పీ అభినందన

సంజనకుఎస్పీ అభినందన