
కఠినమైన అంశాలపై పట్టు సాధిస్తే..
గణితంలో కఠినమైన అంశాలపై పట్టు సాధిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. పాత ప్రశ్నపత్రాలు, నమూనా లెక్కలను ఎక్కువగా సాధన చేయాలి. అభ్యాస దీపికలు, ప్రీ ఫైనల్‌లో అడిగిన ప్రశ్నలను పరిశీలించాలి.
– సగర్ విశ్వనాథ్, మ్యాథ్స్ టీచర్, జెడ్పీహెచ్‌ఎస్, కానుకుర్తి
గణితంలో ప్రతి అధ్యాయంలో ఇచ్చిన భావాలపై పట్టు సాధిస్తే ప్రశ్నను ఏ విధంగా అడిగినా సమాధానం రాసే వీలుంటుంది. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, త్రికోణమితి అధ్యాయాలపై పట్టు సాధించాలి. ముందుగా సులువైన వాటిని స్పష్టంగా జవాబులు రాయాలి. తర్వాత కఠినమైన వాటిని సాధించేందుకు ప్రయత్నించాలి. రేఖా చిత్రాలు పెన్సిల్‌తో గీయాలి. సాధనలు డబ్బాలో రాయాలి.

కఠినమైన అంశాలపై పట్టు సాధిస్తే..