
మార్మోగిన అంజన్న నామస్మరణ
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం శనివారం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా నెల రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా రెండో వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సంద్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలను ఆచరించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

మార్మోగిన అంజన్న నామస్మరణ