ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Mar 14 2025 12:49 AM | Updated on Mar 14 2025 1:15 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఎల్‌ఆర్‌ఎస్‌పై కల్పించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి సూచించారు. ఈ విషయంపై దరఖాస్తుదారులందరికీ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఈ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా లే–అవుట్‌, ప్లాట్‌ యజమానులకు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ఫోన్‌ ద్వారా సమాచారం అందించి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో మెప్మా ఆర్‌పీలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌డెస్క్‌ ద్వారా దరఖాస్తుదారులు నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారమే ఈ నెల 31 లోగా రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డి.మహేశ్వర్‌రెడ్డి, మెప్మా ఇన్‌చార్జ్‌ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు

చిరుధాన్యాల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్‌ విజయేందిర అన్నారు. స్థానిక మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ‘ఆహారంతో ఆరోగ్యంశ్రీలో భాగంగా చిరు ధాన్యాల వంటకాలపై శిక్షణ, మానవ అక్రమ నివారణపై అవగాహన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మానవ అక్రమ రవాణా ప్రధాన సమస్యగా ఉందని, మహిళా సంఘాల సభ్యులు అప్రమత్తంగా గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కలిగిస్తూ ఐక్యంగా, సంఘటితంగా సామాజిక రుగ్మతలను రూపు మాపాలని తెలిపారు. చిరుధాన్యాలతో మిల్లెట్‌ రాంబాబు 10 రకాల వంటకాలు డెమో నిర్వహించారు. వంటకాలు మహిళా సభ్యులకు, అతిథులకు వడ్డించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నర్సింహులు, అదనపుడీఆర్‌డీఓ జోజప్ప, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి సుమతి, కోశాధికారి అనిత, డీపీఎంలు నాగమల్లిక, చెన్నయ్య, సలోమి, ఏపీఎంలు మాధవి, నాగరాజు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ విజయేందిర బోయి

మున్సిపల్‌ కార్యాలయంలో ప్రక్రియ పరిశీలన

నిబంధనల ప్రకారమే రుసుం చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement