అడ్డాకుల: మండలంలోని కందూర్ శివారులో స్వయంభూగా వెలిసి దక్షిణకాశీగా పేరొందిన శ్రీరామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు గోపూజతో మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో భూతబలి కార్యక్రమం నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. విఘ్నేశ్వర పూజ, అగ్నిప్రతిష్ఠ, అంకురారోహణ, ధ్వజారోహణం, బలిహరణ కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజ స్థాపన చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ఆలయంలో పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్ అసిస్టెంట్ అనంతసేన్‌రావు, ఆలయ నిర్వాహకులు రవీందర్‌శర్మ, కారెడ్డి నాగిరెడ్డి, తోట శ్రీహరి, దామోదర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, విజయలక్ష్మి, కారెడ్డి లత, దేవన్న యాదవ్, ఆలయ పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు
నేడు పార్వతి సమేత రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం
రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం