శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
వివరాలు 8లో u
మహబూబ్‌నగర్ న్యూటౌన్: భూమి లేని పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇవ్వాలని కొందరు.. పట్టాలు పొందినా తమను భూమిలోకి రానివ్వడం లేదంటూ మరికొందరు రైతులు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో క్షేత్రస్థాయిలో పట్టాదారులు అయోమయానికి గురవుతున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు ఇచ్చిన భూములు అటవీ శాఖ భూములా? లేక ప్రభుత్వ మిగులు భూములా అనేది తేలడం లేదు. ఇదిలా ఉంటే, అటవీ సరిహద్దులో ఉన్న రెవెన్యూ మిగులు భూమిలో తమకు పట్టాలివ్వాలని కొందరు రైతులు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. జిల్లాలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా.. సమస్య పరిష్కారంపై ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో రెండు, మూడు అటవీ సరిహద్దు గ్రామాల్లో జాయింట్ సర్వే నిర్వహించినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. ఉమ్మడిగా సర్వే నిర్వహించి రెవెన్యూ, అటవీ శాఖల భూముల హద్దులను నిర్ణయిస్తే.. సమస్యకు పరిష్కారం దొరికే ఆస్కారమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. జాయింట్ సర్వే నిర్వహించి మిగులు భూముల లెక్క తేల్చాలని.. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.
హద్దులు లేకపోవడంతో..
రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన భూములకు హద్దులు లేకపోవడంతో సమస్య మరింత పెద్దదైంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో దాదాపు 48,320 ఎకరాల భూమికి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చింది. మొత్తం 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో అటవీ విస్తీర్ణం దాదాపు 66,901.05 ఎకరాల్లో ఉంది. ఇందులో అటవీ సరిహద్దులోని 11 మండలాల్లో దాదాపు 38,770 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అటవీ సరిహద్దు గ్రామాల్లో హద్దులు లేకపోవడం కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి.
న్యూస్‌రీల్