ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక కార్యాచరణతో ముందుకు..

Dec 30 2024 12:46 AM | Updated on Dec 30 2024 10:52 AM

ప్రత్యేక కార్యాచరణతో ముందుకు..

ప్రత్యేక కార్యాచరణతో ముందుకు..

కొత్త ఏడాది 2025లో జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలను పూర్తిగా కట్టడి చేయడంతోపాటు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం. జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్న కేసులపై దృష్టిపెట్టడంతోపాటు రోడ్‌ మ్యాప్‌ ఏర్పాటు చేసుకుంటున్నాం. జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను తగ్గిస్తాం. హెల్మెట్‌ వాడకంపై కూడా సరైన ప్రణాళికతో ముందుకెళ్తాం. పాలమూరును గంజాయి రహిత జిల్లాగా ప్రకటించడానికి పూర్తిస్థాయిలో మత్తు పదార్థాలు కట్టడి చేస్తాం. గంజాయి సరఫరా చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. నేరస్థులకు కోర్టులలో మరిన్ని శిక్షలు పడేలా దర్యాప్తు వేగవంతం చేస్తాం. సైబర్‌ నేరాల కట్టడి కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సహాయంతో మహిళలపై జరుగుతున్న నేరాలు కట్టడితోపాటు వేధింపులకు అడ్డుకట్ట వేస్తాం. పోలీస్‌ సిబ్బంది సంక్షేమం కోసం నూతన సంవత్సరంలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. – జానకి, ఎస్పీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement