నేషనల్ క్రికెట్ లీగ్‌కు పాలమూరు క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్‌సీఎల్)కు జిల్లాకేంద్రానికి చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని మొయినాబాద్ క్రికెట్ మైదానంలో బుధవారం జరిగిన సౌత్‌జోన్ రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్ మ్యాచుల్లో షేక్ ఫర్హాన్, మహ్మద్ ముర్తుజా అలీ, జి.శ్రేయాన్ మెరుగైన ప్రతిభ కనబరిచి అండర్–12 విభాగంలో ఎన్‌సీఎల్ లీగ్‌లో చోటు దక్కించుకున్నారు. వీరు త్వరలో గోవా, హైదరాబాద్‌లో జరిగే ఎన్‌సీఎల్ లీగ్ వేలంలో పాల్గొననున్నారు. షేక్ ఫర్షాన్ మూడేళ్ల వయస్సు నుంచి క్రికెట్ శిక్షణ ప్రారంభించి బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు. స్థానిక బ్రదర్ హుడ్ క్రికెట్ క్లబ్‌లో గత రెండేళ్ల నుంచి కోచ్ ముఖ్తార్ వద్ద ప్రత్యేక క్రికెట్ శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే మహ్మద్ ముర్తుజా అలీ బౌలర్‌గా ప్రతిభ చాటుతున్నాడు. గత ఏడు నెలల నుంచి జిల్లాకేంద్రంలోని బీఎస్‌ఆర్ క్రికెట్ క్లబ్‌లో కోచ్ నవాజ్‌షా వద్ద శిక్షణ పొందుతున్నాడు. జి.శ్రేయాన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నాడు. రెండేళ్లుగా బ్రదర్ హుడ్ క్రికెట్ క్లబ్‌లో కోచ్ రియాజుద్దీన్ వద్ద శిక్షణ తీసుకోగా.. ప్రస్తుతం పెవిలియన్ క్రికెట్ క్లబ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. వీరి ఎంపికపై ఆయా క్లబ్‌ల కోచ్‌లు ఎండీ రియాజుద్దీన్, ముఖ్తార్, నవాజ్‌షాలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్‌సీఎల్ లీగ్‌లో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు.
నేషనల్ క్రికెట్ లీగ్‌కు పాలమూరు క్రీడాకారులు
నేషనల్ క్రికెట్ లీగ్‌కు పాలమూరు క్రీడాకారులు


