‘అయోమయంలో రజకులు’
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తెలంగాణలో గత ప్రభుత్వం రజక వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకురాగా ఆ పథకాన్ని తాము కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారని.. 18 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో అయోమయంలో ఉన్నారని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి తెలిపారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 73 వేల మంది రజక వృత్తిదారులు దుస్తులు ఇసీ్త్ర చేస్తూ జీవనం సాగిస్తున్నారని.. ఒక్కొక్కరికి రూ.వేలలో బిల్లులు రావడం, అధికారులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. విద్యుత్‌శాఖకు ఉన్న ఉచిత విద్యుత్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షుడు కేతూరి శివన్న, జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు సి.సతీష్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు మడెలయ్య నాగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి మైబు తదితరులు పాల్గొన్నారు


