TS Elections 2023: ఆ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి​ గెలిచినా.. ఓ రికార్డే..!

- - Sakshi

బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే హ్యాట్రిక్‌

కాంగ్రెస్‌ గెలిస్తే పోటీచేసిన తొలిసారే విజయం

బీజేపీ సుదీర్ఘకాలం తర్వాత గెలిచినట్లవుతుంది..

జడ్చర్ల టౌన్‌: ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు గెలిచినా రికార్డు నమోదవుతుంది. 1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడగా.. మొత్తం 15సార్లు ఎన్నికలు జరిగాయి. 1996, 2008లో రెండు ఉపఎన్నికలు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా వరుసగా మూడు సార్లు గెలవలేదు. 1972, 1978 ఎన్నికల్లో నర్సప్ప వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించగా, మూడవ సారి ఓటమిపాలయ్యారు.

1983, 1985 ఎన్నికల్లో కృష్ణారెడ్డి వరుసగా గెలిచి మూడవ పర్యాయం ఓడిపోయారు. ఆ తర్వాత 1996, 1999 ఎన్నికల్లో ఎర్రశేఖర్‌ వరుసగా విజయం సాధించి, 2004లో మూడవసారి ఓటమిపాలయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో లక్ష్మారెడ్డి వరుసగా గెలుపొందగా.. ప్రస్తుతం ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పర్యాయం గెలిస్తే హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పడంతో పాటు నియోజకవర్గంలో నాలుగో సారి ఎమ్మెల్యే అయిన ఘనత దక్కుతుంది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి విషయానికొస్తే.. ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచారు. ఆయన విజయం సాధిస్తే పోటీ చేసిన తొలిసారే విజయం సాధించినట్లవుతుంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి చిత్తరంజన్‌దాస్‌ పోటీలో ఉన్నారు. ఆయన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఓ పర్యాయం మంత్రిగా పనిచేశారు. 1985 ఎన్నికల్లో దివంగత ఎన్‌టీ రామారావును ఓడించి రాష్ట్రంలోనే పేరుగాంచారు.

అదే స్ఫూర్తితో జడ్చర్లలోనూ విజయం సాధిస్తానన్న ధీమాలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే బీజేపీకి తొలి విజయంగా నిలుస్తుంది. ఆయన సుదీర్ఘకాలం తర్వాత గెలుపొందినట్లు అవుతుంది. జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి 16వ సారి నిర్వహిస్తున్న సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఓ రికార్డుగానే చెప్పవచ్చు.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-11-2023
Nov 22, 2023, 11:37 IST
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్‌ / సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది....
22-11-2023
Nov 22, 2023, 11:34 IST
అచ్చంపేట: ఎన్నికల్లో గెలుపొంది ప్రజాప్రతినిధిగా పేరు పొందాలని అనుకోని రాజకీయ నాయకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అందుకోసం ఎవరికి వారు...
22-11-2023
Nov 22, 2023, 11:19 IST
నల్గొండ: భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన భారత పౌరులందరికీ ఓటు హక్కు ఉంటుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న...
22-11-2023
Nov 22, 2023, 11:06 IST
జడ్చర్ల టౌన్‌: ఏ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో అయినా పోలింగ్‌ బూత్‌కు వెళ్లడం.. ఓటర్‌ స్లిప్‌, గుర్తింపు కార్డు చూపడం.....
22-11-2023
Nov 22, 2023, 10:26 IST
బీజేపీ బండారాన్ని నిర్మలా సీతారామన్‌ బయటపెట్టారని.. పంట పొలాల మోటార్లకు సంబంధిం..
22-11-2023
Nov 22, 2023, 10:09 IST
మహబూబ్‌నగర్: కొల్లాపూర్‌లో బర్రెలక్క అలియాస్‌ శిరీష స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం కోడేరులో ప్రచారం ముగించుకుని వెన్నచర్ల...
22-11-2023
Nov 22, 2023, 10:07 IST
సాక్షి,ఆదిలాబాద్‌: బోథ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు ప్రయోజనమెంతా అనే చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీల ప్రచారం...
22-11-2023
Nov 22, 2023, 07:49 IST
హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ రాజధాని...
22-11-2023
Nov 22, 2023, 04:35 IST
సాక్షి, హైదరాబాద్‌:  ప్రచార పర్వం మరో వారం రోజులే మిగిలిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ బడా నేతలను రంగంలోకి దింపుతోంది....
22-11-2023
Nov 22, 2023, 04:29 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ...
22-11-2023
Nov 22, 2023, 04:25 IST
దుబ్బాక టౌన్‌/సిరిసిల్ల: ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టవద్దని, కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే ఢిల్లీయే పెత్తనం చెలాయిస్తుందని బీఆర్‌ఎస్‌...
22-11-2023
Nov 22, 2023, 04:20 IST
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్‌/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ వాళ్లు కొత్త డ్రామా మొదలుపెట్టారని.. ఆ పారీ్టకి...
22-11-2023
Nov 22, 2023, 04:12 IST
హుస్నాబాద్‌/చిగురుమామిడి/ అక్కన్నపేట/కోహెడ: కరెంటు సరఫరా ప్రధాన ఎజెండాగానే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, మూడు గంటలు కరెంట్‌ ఇచ్చే కాంగ్రెస్‌...
22-11-2023
Nov 22, 2023, 01:22 IST
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన చరిత్ర ప్రశాంత్‌రెడ్డి సొం తం. ఈసారి మేనల్లుడు అయిన ప్రశాంత్‌రెడ్డిపై ఎలాగైన...
21-11-2023
Nov 21, 2023, 19:16 IST
సాక్షి, మంచిర్యాల : ఎన్నికల్లో  గెలవలేకే తనపై  ఐటీ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌...
21-11-2023
Nov 21, 2023, 18:20 IST
సాక్షి, సిరిసిల్ల : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్...
21-11-2023
Nov 21, 2023, 18:02 IST
సాక్షి, మధిర : ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సీల్పీ నేత భట్టి విక్రమార్క కౌంటర్‌​ ఇచ్చారు. కేసీఆర్‌ మధిర...
21-11-2023
Nov 21, 2023, 13:36 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు సొంత పార్టీలో కొందరి...
21-11-2023
Nov 21, 2023, 12:04 IST
బోడుప్పల్‌: కాంగ్రెస్‌ పార్టీ 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నాయకురాలు చామకూర...
21-11-2023
Nov 21, 2023, 10:50 IST
సాక్షి, పెద్దపల్లి: మంథని అసెంబ్లీకి ప్రధాన పార్టీల తరపున నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నా.. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ... 

Read also in:
Back to Top