నారాయణపేట నియోజకవర్గంలో చివరి రోజు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పర్నికారెడ్డి, బీఎస్పీ నుంచి శ్రీనివాసులు నామినేషన్ వేశారు. మొత్తం పది మంది అభ్యర్థులు 19 సెట్ల నామినేషన్లను సమర్పించారు. మక్తల్ నియోజకవర్గంలో చివరిరోజు 22 నామినేషన్లు వేయగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి, బీజేపీ అభ్యర్థి జలంధర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి వర్కటం జగన్నాథ్‌రెడ్డి, సీపీఐ నుంచి కొండన్న నామినేషన్లు వేశారు. మరో 10 మంది ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేశారు. మొత్తం 15 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కొడంగల్‌లో బీజేపీ అభ్యర్థి బంటు రమేశ్, బీఎస్పీ అభ్యర్థి నర్మద శుక్రవారం నామినేషన్లు వేశారు. నియోజకవర్గంలో మొత్తం 16 మంది అభ్యర్థులు 26 సెట్లను దాఖలు చేశారు.