రెండేళ్లలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు

సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు    - Sakshi

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): రానున్న రెండేళ్లలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృషి, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చని అన్నారు. హైదరాబాద్‌ తరహాలో జిల్లాలో సైతం సెట్విన్‌ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం న్యాక్‌ తరహాలో శిక్షణ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 15 బ్యాచుల్లో 2వేలకు పైగా అభ్యర్థులు శిక్షణ తీసుకున్నారని పేర్కొన్నారు. శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ఆయా వృత్తులలో వ్యాపారంతో పాటు, ఉద్యోగాలు సైతం చేసుకోవచ్చని తెలిపారు. టైలరింగ్‌, స్టిచ్చింగ్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, మొబైల్‌ రిపేర్‌, ఏసీ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని, వీటన్నింటిలో మంచి నైపుణ్యంతో శిక్షణ పొంది ఉద్యోగావకాశాలు కల్పించుకోవాలన్నారు. పాలమూరు ఐటీ కారిడార్‌లో సుమారు 40 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. జిల్లాకు పెద్దపెద్ద పరిశ్రమలు రాబోతున్నాయని, అందువల్ల యువత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ట్రేడ్‌లో శిక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎస్పీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top