తొర్రూరు రూరల్: ఇటీవల బదిలీపై వెళ్లిన మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు డివిజన్ కేంద్రంలోని పాఠశాల ఎదుట అన్నారం రోడ్డుపై ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ శంకర్ ప్రతీరోజు తమను పర్యవేక్షిస్తూ నాణ్యమైన విద్య, భోజనం, టిఫిన్స్ అందించడానికి కృషి చేశారని కొనియాడారు. ప్రిన్సిపాల్‌పై కొంతమంది కుట్రలు చేసి బదిలీ చేయించారని ఆరోపించారు. వెంటనే బదిలీపై వెళ్లిన ప్రిన్సిపాల్ శంకర్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధ్యాపకులు ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.


