కేయూలో రెండు రోజులు జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

కేయూలో రెండు రోజులు జాతీయ సదస్సు

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

● ఈ నెల 7,8వ తేదీల్లో నిర్వహణ

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం, బయోటెక్నాలజీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ‘మోడర్న్‌ బయోటెక్నాలజీ చాలెంజెస్‌ అండ్‌ అపార్చునిటీస్‌’ అనే అంశంపై నిర్వహించనున్న ఈ జాతీయ సదస్సు ఈనెల 7న యూనివర్సిటీలోని సెనెట్‌ హాల్‌లో ఉదయం10:30 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్యఅతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, సైన్స్‌ఫ్యాకల్టీ డీన్‌ బి. వెంకట్రామ్‌రెడ్డి పాల్గొనున్నారు. మైసూర్‌లోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ గిరిధర్‌ పర్వతం కీలకపోన్యాసం చేస్తారు.ఈ సదస్సు ముగింపు సభ ఈనెల 8న సాయంత్రం నిర్వహిస్తారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి. మనోహర్‌, రూసానోడల్‌ అధికారి ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారని ఈ జాతీయ సదస్సు కన్వీనర్‌ పి. శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ టి. శాస్త్రి తెలిపారు.

విద్యార్థుల మధ్య ఘర్షణ

మహబూబాబాద్‌ అర్బన్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రలోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై ఆర్సీఓ లక్ష్మీనారాయణనాయక్‌ ఆదివారం గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్సీఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏడో తరగతి విద్యార్థి రాత్రి 9:30 గంటలకు పాఠశాల ఆవరణలో తిరుగుతుంటే ఇంటర్‌ విద్యార్థి మందలించి కొట్టాడని తెలిపారు. సదరు విద్యార్థి ఈ విషయం తన అన్న పదో తరగతి విద్యార్థికి తెలుపగా ఇంటర్‌ విద్యార్థిని మా తమ్ముడిని ఎందుకు కొట్టావని అడిగాడు. రాత్రి వేళ ఎందుకు తిరుగుతున్నావని మందలించానని చెప్పగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసిందన్నా రు. ఈ ఘర్షణలో పదో తరగతి విద్యార్థి చేతికి గాయమైందని, వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ఉపాధ్యాయులు చికిత్స అందించారని తెలిపారు. టౌన్‌ సీఐ, పోలీసులు, తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించామని చెప్పారు. ఇంటర్‌ చదువుతున్న ఐదుగురి విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్‌ అశోక్‌కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement