గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్‌

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

● వివరాలు వెల్లడించిన పోలీసులు

జనగామ : గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైలు భరత్‌, నర్సయ్యతో కలిసి సీఐ మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన ఎస్సై భరత్‌ ఆధ్వర్యంలో సిబ్బంది కరుణాకర్‌, కృష్ణ, శ్రీకాంత్‌, శివప్రసాద్‌, రమేశ్‌, సాగర్‌, రాజేశ్‌, శ్రీను సూర్యాపేట రోడ్డుపై వాహనాల తనిఖీలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో రెండు బైక్‌లపై ఐదుగురు వ్యక్తులు ఇట్టబోయిన ఉదయ్‌కుమార్‌ (కుందారం, ప్రస్తుతం హైదరాబాద్‌), పోతుగంటి సుధీర్‌ (పెద్దమడూరు), పంజాల శివకుమార్‌ (హైదరాబాద్‌), నందనబోయిన సందీప్‌ (కుందారం), తాండ్ర అభిషేక్‌ (శామీర్‌పేట) పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా తమ వద్ద గంజాయి ఉందని వెల్లడించినట్లు తెలిపారు. ఐదుగురి నుంచి 245 గ్రాముల గంజాయి, రెండు బైక్‌లు, నాలుగు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

అతిగా మద్యం తాగి పెయింటర్‌ మృతి

ఖిలా వరంగల్‌: అతిగా మద్యం తాగి నిద్రలోనే పెయింటర్‌ మృతి చెందినట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట మల్లేశం (40) పెయింటర్‌గా పనిచేస్తూ భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసై శుక్రవారం ఉదయం పనికి వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం భార్య గౌతమి ఉదయం లేచి చూడగా ఇంటి ముందు బాల్కానీలో పడుకొని ఉన్నాడు. ఎంతలేపినా లేవకపోవడంతో కుటుంబ సభ్యుల సహకారంతో ఎంజీఎం తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement