జాతీయ స్థాయిలో పతకాలు తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో పతకాలు తీసుకురావాలి

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

● త్వరలో జేఎన్‌ఎస్‌లో ఖోఖో ఇండోర్‌ స్టేడియం

● ఖోఖో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎథిక్స్‌ కమిషన్‌ కన్వీనర్‌ జంగా రాఘవరెడ్డి

● అట్టహాసంగా ఉమ్మడి జిల్లా జూనియర్‌ బాలబాలికల ఖోఖో ఎంపికలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో రూ.1.79 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఖోఖో ఇండోర్‌ స్టేడియం రాబోతోందని ఖోఖో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎథిక్స్‌ కమిషన్‌ కన్వీనర్‌, తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. జేఎస్‌ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో జూనియర్‌ బాలబాలికల ఖోఖో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం, సహా య సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే తమ ప్రతిభను ని రూపించుకుని జాతీయ స్థాయిలో పతకాలు సా ధించి జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని చాటాలన్నారు. ఉమ్మ డి వరంగల్‌ జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న 45వ రాష్ట్రస్థాయి జూ నియర్‌ ఖోఖో పోటీల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎంపికై న బాలబాలికల జట్లకు క్రీడా దుస్తులను డిస్ట్రిక్ట్‌ సైన్స్‌ ఆఫీసర్‌ పి. సురేశ్‌ బాబు అందజేశా రు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు రాంగోపాల్‌ రెడ్డి, మహమ్మద్‌ రహమాన్‌, కుసుమ సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement