ఉత్సాహంగా నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్స్‌ మీట్‌

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌ : హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్స్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–14,16 బాలబాలికల విభాగంలో నిర్వహించిన పోటీలకు వరంగల్‌ జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు హాజరైనట్లు అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఊర యుగెంధర్‌రెడ్డి తెలిపారు. అండర్‌–14 విభాగంలో ట్రయథ్లాన్‌ ఈవెంట్లలో ఏ, బీ, సీ కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా, అండర్‌–16 విభాగంలో 60, 600 మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌జంప్‌, హైజంప్‌, జావెలిన్‌త్రో ఈవెంట్లలో పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 13 మంది అథ్లెట్లు వచ్చే నెల 14 నుంచి 16వ తేదీ వరకు సంగారెడ్డిలోని వోక్సన్‌ యూనివర్సిటీలో జరగనున్న నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 560 జిల్లాల నుంచి సుమారు ఆరు వేల మంది క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. అనంతరం విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, వరంగల్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ గట్టు మహేశ్‌బాబు, అధ్యక్షుడు పుల్యాల కిషన్‌, పీడీలు వాసుదేవరావు, రజనీకాంత్‌, కృష్ణమూర్తి, మహేందర్‌, కోచ్‌లు శ్రీమన్నారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement