పౌష్టికాహారమే ఆరోగ్యానికి రక్షణ | - | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారమే ఆరోగ్యానికి రక్షణ

Oct 4 2026 10:13 AM | Updated on Oct 4 2026 10:13 AM

పౌష్టికాహారమే ఆరోగ్యానికి రక్షణ

గూడూరు: పౌష్టికాహారమే ఆరోగ్యాన్ని రక్షిస్తుందని సీడీపీఓ నిమ్మల నీలిమ అన్నారు. మండలంలోని ఊట్ల పాఠశాలలో శనివారం పోషణమాసంలో భాగంగా దామరవంచ సెక్టార్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ శ్యామలాదేవి, టీచర్లు తిరుపతమ్మ, నాగలక్ష్మి, రజిని, భారతి, పాల్గొన్నారు.

దంతాలపల్లి: చిన్నతనం నుంచే పౌష్టికాహారం తినిపిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అక్కిరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామానుజాపురం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మల్లం మౌనిక, అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పాల్గొన్నారు.

ఇనుగుర్తి: మండలంలోని కోమటిపల్లి గ్రామపంచాయతీ 1వ అంగన్‌వాడీ కేంద్రంలో ‘పోషణ మాసం’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మద్దెల భిక్షపతి, ఉపసర్పంచ్‌ బాబు, సూపర్‌వైజర్‌ దుర్గ, ఏఎన్‌ఎం మంజుల పాల్గొన్నారు.

తొర్రూరు రూరల్‌: చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్‌ జాటోతు గంగా నరేష్‌నాయక్‌ అన్నారు. శనివారం మండలంలోని అమర్‌సింగ్‌ తండాలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి ముద్ద అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement