మహబూబాబాద్ అర్బన్: మత్తు పదార్థాల వినియోగం, వాటివల్ల కలిగే నష్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అర్వపల్లి కృష్ణతేజ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కృష్ణతేజ మాట్లాడుతూ.. జీవితంలో విద్యార్థి దశ ఎంతో విలువైందని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వాడకం, సరఫరా నేరమని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై అరుణ్‌కుమార్, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ డోలి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
గాంధీ జీవితం ఆదర్శనీయం
మహబూబాబాద్: మహాత్మా గాంధీ జీవితం ఆదర్శనీయని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని గాంధీ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో వ్యాసరచన పోటీ నిర్వహించారు. జిల్లా స్థాయి విజేతలకు అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ ప్రశంస పత్రాలు, బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ పరికిపండ్ల అశోక్ పాల్గొన్నారు.
క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : పోలీసు సిబ్బంది విధి నిర్వహణతోపాటు శారీరక దారుఢ్యం, క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు, రెండు రజత పతకాలు సాధించారు. టెన్నిస్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం, ఓపెన్ సింగిల్స్ విభాగం, ఓపెన్ డబుల్స్ విభాగంలో రజత పతకాలు సాధించారు. పతకాలు సాధించిన శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ శనివారం ఎస్పీ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారిని ఎస్పీ అభినందించారు.
ఆరుతడి పంటలు సాగుచేయాలి
మహబూబాబాద్ రూరల్ : ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర సూచించారు. మహబూబాబాద్ రైతు వేదికలో మండలంలోని రైతులకు శనివారం ఏర్పాటు చేసిన ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సులో విజయచంద్ర మాట్లాడారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల యాసంగిలో రైతులు వరి సాగు తగ్గించి పెసర, మినుము, వేరుశనగ, సోయా, మొక్కజొన్న పంటలు వేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా అందజేస్తున్న సబ్సిడీ విత్తనాలు వాటి వివరాలు రైతులకు తెలిపారు. సదస్సులో డివిజన్ ఏడీఏ శ్రీనివాసరావు, టెక్నికల్ ఏఓలు రాంజీ, కార్తీక్, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.
మెన్, ఉమెన్ బాక్సింగ్ సెలక్షన్స్
కేయూ క్యాంపస్: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మెన్ బాక్సింగ్‌పోటీలకు, రాజస్దాన్‌లో జరిగే ఉమెన్ బాక్సింగ్ పోటీలకు శనివారం కాకతీయ యూనివర్సిటీలో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ డాక్టర్ టి.శాస్త్రి తెలిపారు. ఎంపికల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జె సోమన్న, జాయింట్ సెక్రటరీ మట్టెడ కుమార్, సెలక్షన్స్ ఇన్‌చార్జ్ డాక్టర్ కుమార్, కోచ్ రమేష్, సెలెక్టర్లు మౌనిక, పవన్ పాల్గొన్నారు.


