● విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్
నెహ్రూసెంటర్: తక్కువ ఖర్చుతో విద్యుత్ తయారు చేసుకునే అవకాశం ఉన్న సోలార్ వైపు ప్రతీ ఒక్కరు అడుగులు వేయాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బీజ్లీ యోజనపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో సోలార్ ద్వారా విద్యుత్ వినియోగం పెరుగుతుందని, పథకం, సబ్సిడీని వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా రూ.78 వేల సబ్సిడీ అందుతుందన్నారు. సోలార్‌ను వినియోగిస్తూ మానుకోటను గ్రీన్‌సిటీగా మార్చాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, డీఈటీ హీరాలాల్, ఏఈలు వెంకటేశ్వర్లు, సంగీత, హరీశ్, ఏఈ కమర్షియల్ శ్రీధర్‌రెడ్డి, శివకాశి సోలార్ వెండర్ ధరావత్ వెంకన్ననాయక్, నందులాల్, సుధాకర్, రాంబాబు, రమేష్, కౌన్సిలర్లు ముత్యం వెంకన్న, చిదిరాల అరుణజ్ఞానేశ్వర్, దిలీప్, లక్ష్మీనారాయణ, నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.


