‘తొలిమెట్టు’ బలోపేతానికి ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

‘తొలిమెట్టు’ బలోపేతానికి ప్రత్యేక చర్యలు

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: విద్యా శాఖ ద్వారా తొలిమెట్టు కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల్లో చదివే రాసే నైపుణ్యాలతోపాటు ప్రాథమిక గణిత భావనలపై స్పష్టమైన అవగాహన పెంచడమే తొలిమెట్టు ఉద్ధేశమన్నారు. ఆట పాటల ఆధారంగా సృజనాత్మక పద్ధతిలో విద్యాబోధన అందించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. డిజిటల్‌ తరగతులు, ఏఐ విధానం ద్వారా బోధించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నితీష్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement