ఉపాధి దొరుకుతోంది | - | Sakshi
Sakshi News home page

ఉపాధి దొరుకుతోంది

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

గ్రామంలోని ఫారెస్ట్‌ భూమిలో సీతాఫలాల చెట్లు ఉండడం వల్ల మాకు రెండు నెలల పాటు జీవనోపాధి దొరుకుతుంది. ప్రతి రోజూ చెట్టు ఎక్కి కాయలు తెంపి లోడింగ్‌ చేయడం వంటి పని దొరుకుతుంది. చెట్లు కాయ దశలో నీటిని పారించడానికి తగు సదుపాయాలను సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలి. దీంతో మరింత ఎక్కువ సీతాఫలాల దిగుబడి వస్తుంది.

– జంగిటి కృష్ణ, స్థానికుడు

గ్రామ పంచాయతీకి ఆదాయం

ఫారెస్ట్‌ ల్యాండ్‌లోని సీతాఫలాలతో గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం వస్తుంది. 2004లో అటవీ శాఖ అధికారులు, గ్రామస్తులతో కలిసి వన సంరక్షణ సమితి కమిటీని ఏర్పాటు చేశారు. ఆదాయంలో సగం డబ్బులను గ్రామ అభివృద్ధికి, మిగతా డబ్బులను అటవీ శాఖ అవసరాలకు వాడుకుంటారు. సుమారు రెండు నెలల పాటు రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు సీతాఫలాల వ్యాపారం జరుగుతుంది.

– గీస సందీప్‌, మన్‌సాన్‌పల్లి, సర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement