ఏటూరునాగారం : ‘నా బిడ్డను కొట్టి.. చంపి.. నోట్లో పురుగుల మందు పోసిండ్లు’ అని మృతురాలి స్వర్ణలత తల్లి సుశీల శనివారం రొయ్యూర్‌లో మీడియా ఎదుట రోదించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన సొదారి హరీష్, దుర్గం స్వర్ణలత (గర్భిణి) 2025లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్నం వేధింపులతో స్వర్ణలత మృతి చెందిన విషయం తెలిసింది. ఈ విషయంపై మృతురాలి తల్లి సుశీల మీడియాతో మాట్లాడారు. ‘నా బిడ్డను ఇదే గ్రామానికి చెందిన హరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్నం తేవాలని నిత్యం వేధించేవాడు. 5లక్షల కట్నం, రెండెకరాల భూమి, రెండు తులాల బంగారం ఇవ్వాలని రోజూ భర్త, అత్త, మామ వేధించే వారు. ఒక బాబు ఉన్నాడని, నాలుగు నెలల గర్భిణిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరుగా విలపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని, స్వర్ణలత మృతికి కారణమైన వారికి కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.
● ‘నా బిడ్డ చావుకు కారణమైన
వారిని కఠినంగా శిక్షించాలి’


