గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి నిట్‌ సాంకేతికత | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి నిట్‌ సాంకేతికత

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

● కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

కాజీపేట అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మహానగర పాలక సంస్ధ అభివృద్ధికి నిట్‌ వరంగల్‌ సాంకేతికత పరిజ్ఙానం తోడ్పడుతుందని కలెక్టర్‌,గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. నిట్‌ వరంగల్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలను కలెక్టర్‌ శనివారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరిశీలించారు. నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ, నగర భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతుల ప్రణాళికలో నిట్‌ సాంకేతికను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. నిట్‌లో నిర్వహించిన డ్రోన్‌ సర్వే విధానం, డ్రోన్‌ డేటాను జీఐఎస్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ, గ్రేటర్‌ వరంగల్‌ సర్వేలో వినియోగించే సాంకేతికత, డేటా రిజల్యూషన్‌ తదితర అంశాలను పరిశీలించారు. నిట్‌ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు ఆవిష్కరించిన ప్రజెక్ట్‌లను అడిగి తెలుసుకున్నా రు.బల్దియా ఎస్‌ ఈ రాజ్‌కుమార్‌,ఈఈలు రవి కుమార్‌, మహేందర్‌, మాధవి, సీపీ రవీంద్ర రా డేకర్‌, ఐటీ మేనేజర్‌ రమేష్‌, నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement