కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. రెండు పరీక్షా కేంద్రాల్లో కలిపి మొత్తం 28 మంది పట్టుబడగా డీబార్ చేశారు. శనివారం దూరవిద్యా కేంద్రంలో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండగా కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజా సందర్శించి తనిఖీ చేశారు. కాపీయింగ్ చేస్తు 26 మంది విద్యార్థులు పట్టుబడగా డీబార్ చేసినట్లు రాజేందర్ తెలిపారు. అనంతరం పరీక్షల విభాగం అధికారులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి వెళ్లారు. అక్కడ కాపీయింగ్ చేస్తున్న ఇద్దరిని పట్టుకోని డీబార్ చేశారు.
ఆన్సర్ షీట్ తీసుకెళ్లి..తిరిగి ఇచ్చిన విద్యార్థి
పట్టుబడిన విద్యార్థుల జవాబు పత్రాలను (ఆన్సర్ షీట్ల) అక్కడి ఇన్విజిలేటర్లకు అధికారులు అందజేశారు. అయితే టేబుల్‌పై ఆన్సర్ షీట్‌లు ఉండగా ఓ విద్యార్థి తన జవాబు పత్రాన్ని తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో సిబ్బంది అతడికోసం ఆరా తీశారు. ఆ తర్వాత అతడి హాల్‌టికెట్ ఆధారంగా సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ ఫోన్ చేసినట్లు సమాచారం. చివరికి సాయంత్రం ఆ విద్యార్థి తండ్రితో కలిసి దూరవిద్యాకేంద్రానికి విచ్చేసి దూరవిద్యాకేంద్రం డైరెక్టర్‌ను కలిసి మాట్లాడారు. తాను కాపీయింగ్ చేయలేదని అయినా తనను కాపీయింగ్ చేసినట్లు బుక్‌చేశారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతంరం ఆన్సర్ షీట్ తిరిగి ఇచ్చేశాడు. దీంతో పరీక్షల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. కాపీయింగ్ చేస్తేనే పట్టుకుని డీబార్ చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షల నియంత్రణాధికారితో వాగ్వాదం
సెమిస్టర్ పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన వి ద్యార్థుల్లో కొందరు పరీక్షల విభాగం వద్దకు వెళ్లి పరీ క్షల నియంత్రణాధికారి రాజేందర్‌తో వాగ్విదాలకు దిగారని సమాచారం. తమకు పాఠ్యపుస్తకాలు కూడా సరిగా ఇవ్వలేదని క్లాస్‌లు అంతంత మాత్రమేనని మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
28మంది విద్యార్థుల డీబార్
పరీక్షల నియంత్రణాధికారితో వాగ్వివాదం


