ఎస్‌ఎస్‌తాడ్వాయి : చిన్న హోటల్ ఆదాయంతో జీవనం గడుపుతున్న ఆ పేద కుటుంబానికి మోయ లేని భారం తోడైంది.. ప్రాణాంతక వ్యాధి చికిత్సకు భారీగా ఖర్చు.. చేతిలో అంత మొత్తం లేకపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. భార్యను ఎలాగైనా కాపాడుకోవాలన్న భర్త ఆరాటానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన ఎలమర్తి ధనలక్ష్మి బోన్ మ్యారో అప్లాసియాతో బాధపడుతోంది. చికిత్సకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
దాతల
సాయంకోసం వేడుకోలు
రూ.20 లక్షలు పెద్ద మొత్తమే అయినా.. ఒక్కరి వల్ల కాకపోయినా పది, వందల మంది కలిసి చేయూత అందిస్తే ఈ కుటుంబానికి కొంత భరోసా కల్పించవచ్చు. పెద్ద మొత్తంలో సాయం చేయలేని వారు సైతం తమకు వీలైనంత అందించాలని కోరుతున్నారు.ధనలక్ష్మి కుటుంబానికి అండగా నిలవాలని ఆర్యవైశ్య సంఘం, కుటుంబ సభ్యులు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో స్పందించి తమకు తోచినంత సాయం చేయాలని కోరుతున్నారు. ధనలక్ష్మి వైద్యానికి మానవత్వంతో స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
దాతలు 73822 25351 నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా
సాయం చేయాలని వేడుకుంటున్నారు..
దాతల సాయంకోసం ఎదురుచూపు
బోన్ మ్యారో అప్లాసియా చికిత్సకు రూ.20లక్షలు అవసరం
పేద కుటుంబానికి మోయలేని భారం


