మిర్చినారుపై గడ్డి మందు పిచికారీ | - | Sakshi
Sakshi News home page

మిర్చినారుపై గడ్డి మందు పిచికారీ

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

● చనిపోయిన మొక్కలు ● పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

ఏటూరునాగారం : కష్టపడి పెంచుతున్న మిర్చినారుపై గిట్టని వారు గడ్డి మందు పిచికారీ చేయడంతో మొక్కలు చనిపోయిను సంఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఏటూరునాగారం గ్రామ పంచాయతీ ప రిధిలోని ఆరో వార్డుకు చెందిన కొండాయి రమేశ్‌కు కొన్ని రోజులుగా పాలిపాగలు, భూముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామన్నగూడెం సమీపంలో 8.30 ఎకరాలకు సరిపడా మిర్చినారు సాగు చేస్తున్నాడు. గింజలు, పైపులు, నారు పెంచడానికి రూ.6లక్షల వరకు ఖర్చయినట్లు రమేశ్‌ వివరించాడు. గడ్డి మందు పిచికారీ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని రై తు రమేశ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. గిట్టని వారు తనపై పగతో కావాలని ఇలా చేశారని కన్నీరుమున్నీరుగా విలపించాడు.

చెత్తకుప్ప మంటలు తాకి

అక్కాతమ్ముడికి గాయాలు

కన్నాయిగూడెం : చెత్తకుప్పకు పెట్టిన మంటలు సమీపంలో ఆడుకుంటున్న అక్కాతమ్ముడిపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూర్‌లో జరగగా ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కొత్తూర్‌కు చెందిన కుమ్మరి రమేశ్‌, నాగలక్ష్మి దంపతులకు కూతురు నిహస్వి(5), కుమారుడు నిహాంత్‌(2) ఉన్నారు. ఇద్దరు కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఆడుకుంటున్నారు. సమీపంలోని చెత్తకు కొందరు నిప్పు పెట్టగా అందులోని ఓ క్రిమిసంహారక బాటిల్‌ పెద్దశబ్ధంతో పేలి పక్కనే ఉన్న పిల్లలపై మంటలు పడ్డాయి. పిల్లలు ఆ మంటతో అరుపులు పెట్టడంతో గమనించిన కుటుంబ సభ్యులు వచ్చి వాటిని ఆర్పి వెంటనే ములుగుకు అక్కడి నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరు మంటలకు తాళలేక అల్లాడిపోతున్నారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో పిల్లల వైద్యచికిత్స కోసం దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement