కూలికి వెళ్లి కానరాని లోకాలకు .. | - | Sakshi
Sakshi News home page

కూలికి వెళ్లి కానరాని లోకాలకు ..

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : కూలికి వెళ్లిన ఓ యువకుడు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మహబూబాబాద్‌ మండలం లక్ష్మా తండా జీపీ పరిధి రేకుల తండాలో చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్సై పి.రాజు కథనం ప్రకారం.. మండలంలోని పర్వతగిరికి చెందిన బొలక శ్రీధర్‌ (37) కూలితోపాటు విద్యుత్‌ మరమ్మతులు కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో రేకుల తండాకు చెందిన గుగులోత్‌ జనార్ధన్‌ తన వ్యవసాయ బావిలోని విద్యుత్‌ మోటారు బయటకు తీసే పనికోసం శ్రీధర్‌ను తీసుకెళ్లాడు. శ్రీధర్‌ వ్యవసాయ బావిలోకి దిగి మోటారు తీసే పనిచేస్తున్న క్రమంలో బావిపై గల పైపు ఊడి అందులో పడి మృతి చెందాడు.

మృతుడి కుటుంబానికి

న్యాయం చేయాలని ధర్నా..

శ్రీధర్‌ మృతికి జనార్ధన్‌ కారణమంటూ అతడి కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లి జనార్ధన్‌ ఇంటి ఎదుట వేసి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న రూరల్‌, కేసముద్రం సీఐలు అంజలి, సత్యనారాయణ, రూరల్‌, నెల్లికుదురు ఎస్సైలు కరుణాకర్‌, రమేశ్‌ బాబు, నరేశ్‌ ఘటనా స్థలికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మృతుడి తల్లి దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై రాజు తెలిపారు.

వ్యవసాయ బావిలో పడి

యువకుడి మృతి

విద్యుత్‌ మోటారు తీస్తుండగా ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement