విందు తెచ్చిన విషాదం.. | - | Sakshi
Sakshi News home page

విందు తెచ్చిన విషాదం..

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

ఖానాపురం: సహఉద్యోగులతో కలిసి విందు కోసం వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం పాకాలలోని గిరికతాటి వనంలో చోటుచేసుకుంది. ఎస్సై రామ్మోహన్‌ కథనం ప్రకారం.. గీసుగొండ మండలం మచ్చాపూర్‌కు చెందిన బిల్ల సునీల్‌(33) వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పని చేస్తున్నాడు. సహ ఉద్యోగులు నరేశ్‌, శివ, నాగరాజు, ఉమేశ్‌, గణేశ్‌తో కలిసి విందు కోసం పాకాల వచ్చారు. గిరకతాళ్ల సమీపంలో వాగు వద్ద సాయంత్రం వరకు విందు చేసుకున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో అందరు కలిసి వాగులోకి ఈతకొట్టడానికి దిగారు. ఈ క్రమంలో నలుగురు వాగులో ఉన్న చెట్టు ఎక్కారు. మొదట సునీల్‌, శివ చెట్టుపై నుంచి వాగులో దూకారు. దూకిన స్థలంలో వాగు లోతుగా ఉండడంతో ఇరువురు నీట మునిగారు. గమనించి చెట్టుపై ఉన్న నరేశ్‌ వెంటనే వాగులోకి దూకి శివను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. సునీల్‌ అప్పటికే నీటి మునిగి గల్లంతు కావడంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రామ్మెహన్‌ సిబ్బందితో కలిసి పాకాలకు చేరుకుని జాలర్ల సహకారంతో రాత్రి వరకు వెతికి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. ఘటనా స్థలి వద్ద మృతుడి తల్లిదండ్రులు యాదమ్మ, సూరయ్య, సోదరి, సోదరుడి రోదనలు మిన్నంటాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

● వాగులో పడి యువకుడి మృతి

● పాకాలలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement