రేపు ఉమ్మడి జిల్లా అండర్‌–14 క్రికెట్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రేపు ఉమ్మడి జిల్లా అండర్‌–14 క్రికెట్‌ జట్ల ఎంపిక

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: కరుణాపురం సమీపం వంగపల్లిలోని క్రికెట్‌ క్రీడా మైదానంలో ఈనెల 2వ తేదీన (శుక్రవారం) ఉమ్మడి జిల్లా క్రికెట్‌ అండర్‌–14 ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులతో డబ్ల్యూడీసీఏ అండర్‌–14 ఇంట్రా డిస్టిక్‌ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉమ్మడి వరంగల్‌ అండర్‌–14 జిల్లా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 01, 2012, ఆ తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు మీసేవ జారీ చేసిన పుట్టిన తేదీ, ఆధార్‌ కార్డు, సొంత క్రికెట్‌ కిట్‌, యూనిఫామ్‌తో ఉదయం 10 గంటలకు మైదానంలో హాజరుకావాలని తెలిపారు.

డోర్నకల్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు

డోర్నకల్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ చర్చి కాంపౌండ్‌ గ్రౌండ్‌లో బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా రగ్బీ పోటీలు ప్రారంభమయ్యాయి. 70వ ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–14, 17 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహిస్తున్న ఈ పోటీలను పీఆర్‌టీయూ జిల్లా కార్యదర్శి సి.హెచ్‌ శ్రీధర్‌తోపాటు ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా సెక్రటరీ ప్రవీణ్‌రెడ్డి ప్రారంభించారు. 220 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారితో ఉమ్మడి వరంగల్‌ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ కురవి మండల అధ్యక్షుడు వెంపటి సీతారాములు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు తలారి విద్యాసాగర్‌, పీఈటీలు రవికుమార్‌, విజయచందర్‌, సునీల్‌, వెంకటేశ్వర్లు, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement